సింహాచలంలో వరాహ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. మంగళవారం ( ఏప్రిల్ 28 ) సింహాచలం ఆలయానికి చేరుకున్న చంద్రబాబు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించారు దేవస్థాన పండితులు.
అనంతరం ఆలయంలోని కప్ప స్తంభం దగ్గర సంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లించారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, గణబాబు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

