హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ కలకలం రేపింది. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఏషియా విమానంలో వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా.. అసలు విషయం బయటపడింది. లగేజీలో 16 ప్యాకెట్ల హైడ్రోపోనిక్ వీడ్ (గంజాయి) ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన ఈ డ్రగ్స్ మొత్తం బరువు 6.150 కిలోలు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు 2 కోట్ల 15 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 27న జరిగిన ఈ తనిఖీల్లో నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
డ్రగ్స్ తరలిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు, అతనిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్‌ను అరికట్టేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

