అంతరిక్ష స్టార్టప్‌‌‌‌‌‌‌‌ లకు ఇన్-స్పేస్ సాయం

అంతరిక్ష స్టార్టప్‌‌‌‌‌‌‌‌ లకు ఇన్-స్పేస్ సాయం

హైదరాబాద్​, వెలుగు: భారత జాతీయ అంతరిక్ష ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) తన టెక్నాలజీ అడాప్షన్ ఫండ్ కోసం మూడు స్టార్టప్‌‌‌‌‌‌‌‌లను ఎంపిక చేసింది. ఆస్ట్రోబేస్ స్పేస్ , శాట్‌‌‌‌‌‌‌‌సూర్ , టీఎమ్‌‌‌‌‌‌‌‌టూ స్పేస్  సాయం అందుకోనున్నాయి.  బెంగళూరుకు చెందిన ఆస్ట్రోబేస్ సంస్థ స్పేస్ లాంచ్ వెహికల్స్ కోసం 800 కేఎన్ క్లోజ్డ్-సైకిల్ లిక్విడ్ రాకెట్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేస్తుంది.

శాట్‌‌‌‌‌‌‌‌సూర్ సంస్థ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లకు లార్జ్ ఎర్త్ అబ్జర్వేషన్ మోడల్ ఏఐ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌ను రూపొందిస్తుంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన టీఎమ్‌‌‌‌‌‌‌‌టూస్పేస్ ఉపగ్రహాల కోసం ఏఐ ఆధారిత స్టార్ ట్రాకర్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేస్తుంది.