భారత్ - వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్.. ఉప్పల్.. టికెట్ల తిప్పల్ !

భారత్ - వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్.. ఉప్పల్.. టికెట్ల తిప్పల్ !
  • టికెట్ జిన్ యాప్‌‌‌‌‌‌‌‌లో అయోమయం
  • ఓపెన్ చేయగానే సోల్డ్ అవుట్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: రెండేండ్ల తర్వాత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుండటంతో క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొన్నప్పటికీ,  మ్యాచ్ టికెట్ల జారీ ప్రక్రియ మాత్రం ఎప్పట్లాగే తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ) ఈసారి పూర్తిగా కొత్తదైన ‘టికెట్ జిన్’ యాప్‌‌‌‌‌‌‌‌ను తెరపైకి తెచ్చింది.

ఈ నెల 14న జరగనున్న భారత్ - వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలు ఈ యాప్ ద్వారా ప్రారంభం కాగా.. యాప్ ఓపెన్ చేసిన క్షణాల వ్యవధిలోనే ‘సోల్డ్ అవుట్’ అని చూపించడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో క్షణాల్లోనే టికెట్లు అయిపోవడం వెనుక ఉన్న పారదర్శకత లోపంపై క్రికెట్ ప్రేమికులు నిలదీస్తున్నారు. 

ఇప్పటి వరకు12వేల టికెట్ల విక్రయం

ఇండియాలో క్రీడలు, మ్యూజిక్ కాన్సర్ట్‌‌‌‌‌‌‌‌లు, కామెడీ షోల వంటి లైవ్ ఈవెంట్లకు టికెటింగ్ సేవలు అందించే  టికెట్ జిన్ యాప్‌‌‌‌‌‌‌‌లో.. డిజిటల్ టికెట్లు పొందడం, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా స్టేడియంలోకి సులభంగా ప్రవేశించే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా, కొనుగోలు చేసిన టికెట్లను మిత్రులకు మొబైల్ ద్వారానే సులభంగా డిజిటల్‌‌‌‌‌‌‌‌గా బదిలీ చేసే ‘సెండ్ టికెట్ టు ఫ్రెండ్స్’ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

అయితే, అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ టికెట్ల విక్రయాలపై హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ సరైన ముందస్తు ప్రకటనలు గానీ, విస్తృత ప్రచారం గానీ చేయకపోవడంతో మెజారిటీ అభిమానులకు ఈ యాప్ గురించే తెలియకుండా పోయింది. రోజువారీ కోటా కింద ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో టికెట్లు విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, యాప్ ఓపెన్ చేసిన క్షణాల వ్యవధిలోనే 'సోల్డ్ అవుట్' అని వస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 12 వేల టికెట్లు మాత్రమే విక్రయించినట్లు తెలుస్తుండగా, మిగిలిన వేలాది టికెట్లు ఎక్కడికి పోతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.