సీతక్కను అవమానించే తీరు చూస్తే.. చెప్పుతో కొడతారు : సీఎం రేవంత్ రెడ్డి

 సీతక్కను అవమానించే తీరు చూస్తే.. చెప్పుతో కొడతారు : సీఎం రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అవమానించారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్షం ఎందుకు ఇలా  వ్యవహరిస్తుందో తెలవడం లేదన్నారు. పూర్తిగా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షాన్ని చూస్తాన్నామన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అక్కలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారా?.. వాళ్లను నేను సొంత అక్కల్లా భావిస్తున్నా అని తెలిపారు. 

 మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించిన తీరు చూస్తే  చెప్పుతో కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్.  ఆదివాసి బిడ్డను అవమానిస్తే ఊరుకుందామా అని ప్రశ్నించారు. సునీతా, సబితా ఇంద్రారెడ్డి కోసం నేను కొట్లాడిన అని తెలిపారు. నన్ను నమ్ముకున్నా అక్కలు ఇవాళ మంత్రులుగా ఉన్నారని తెలిపారు. ఒక అక్క నన్ను నడి బజారులో వదిలేసిందన్నారు. ఎన్నికల కోసం నేను వెళ్తే ఇంకో అక్క నాపై 2  కేసులు పెట్టిందిన్నారు. 

ఆ  కేసులతో ఇప్పటికీ నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు రేవంత్. సీతక్కను కుటుంబసభ్యురాలిగా చూసుకుంటానని.. ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులు అయ్యారని అన్నారు. దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకున్న మీరు ఏమయ్యారని  సునీతా, సబితా ఇంద్రారెడ్డికి హితవు పలికారు.  సొంత చెల్లి తీహార్ జైల్లో ఉందని.. సొంత చెల్లెలు గురించి మాత్రం వారు మాట్లాడరని తెలిపారు. దళితుల పట్ల కేసీఆర్ కు ప్రేమ లేదని.. గతంలో దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చి బర్తరఫ్‌ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు దళిత స్పీకర్ ముందు కూర్చోలేక కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారని తెలిపారు.