సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో.. అర్బన్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ మూవీ.. జూన్లో ప్రారంభం

సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో..  అర్బన్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ మూవీ.. జూన్లో ప్రారంభం

‘పెద్ది’ సినిమా కోసం ఈగర్‌‌‌‌‌‌‌‌గా వెయిట్‌‌‌‌ చేస్తున్న రామ్ చరణ్‌‌‌‌ అభిమానులకు మరో గుడ్ న్యూస్‌‌‌‌ వచ్చింది.  ఈ  సినిమా విడుదలకు ముందే చరణ్‌‌‌‌ హీరోగా నటించనున్న కొత్త చిత్రం సెట్స్‌‌‌‌కు వెళ్లబోతోంది. చరణ్‌‌‌‌ నెక్స్ట్ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌‌‌‌లో ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ నిర్మించిన మైత్రి  మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

 చరణ్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 17వ చిత్రం. జూన్‌‌‌‌ నుంచి ఈ పాన్‌‌‌‌ ఇండియా మూవీ సెట్స్‌‌‌‌కు వెళ్లబోతోందని మైత్రి మూవీస్‌‌‌‌ సీఈవో చెర్రీ వెల్లడించారు. ‘జెట్‌‌‌‌లీ’ ప్రమోషన్స్‌‌‌‌లో మాట్లాడిన ఆయన..  చరణ్‌‌‌‌, సుకుమార్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ పూర్తి కావచ్చినట్టు తెలియజేశారు. 

ఇక రూరల్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ‘రంగస్థలం’ తీసిన సుకుమార్‌‌‌‌‌‌‌‌.. ఈసారి అర్బన్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో యాక్షన్‌‌‌‌ మూవీ తీయబోతున్నట్టు తెలుస్తోంది. ‘ధురంధ‌‌‌‌ర్ 2’ ఫేమ్ శ‌‌‌‌శ్వాంత్ స‌‌‌‌చ్‌‌‌‌దేవ్ దీనికి సంగీతం అందించబోతున్నాడని, రష్మిక లేదా రుక్మిణి వసంత్‌‌‌‌లో ఒకరు హీరోయిన్‌‌‌‌గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక జూన్‌‌‌‌ 25న ‘పెద్ది’ రాబోతోందని ఇటీవల ఓ ఈవెంట్‌‌‌‌లో దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. అయితే యశ్ మూవీ ‘టాక్సిక్‌‌‌‌’ వాయిదా పడ్డ నేపథ్యంలో జూన్‌‌‌‌ 4న ‘పెద్ది’ రాబోతున్నట్టు సమాచారం.