దుర్యోధన, దుశ్శాసన పర్వంలో.. నడి రోడ్డుపై మహిళ బట్టలు లాగేశాడు..

దుర్యోధన, దుశ్శాసన పర్వంలో.. నడి రోడ్డుపై మహిళ బట్టలు లాగేశాడు..

దుర్యోధన, దుశ్శాసన పర్వంలో.. నడి రోడ్డుపై ఓ మహిళ బట్టలు లాగేశాడు కీచకుడు. మద్యం మత్తులో యువతిని వివస్త్రను చేసి.. లైంగికంగా వేధించాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బాలాజీ నగర్ బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. 2023 ఆగస్టు 06 ఆదివారం అర్థరాత్రి రోడ్డుపై యువతి నడుచుకుంటూ వెళ్తుండగా.. పెద్ద మారయ్య అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అందరూ చూస్తుండగానే ఆ మహిళ బట్టలను చించేశాడు. యువతిని అడ్డుకొని ఆమె దుస్తులను చించేశాడు. 

దీంతో ఆ మహిళ రోడ్డుపైనే నగ్నంగా ఉండాల్సి వచ్చింది. ఈ తతంగమంతా యువతి తన కన్నతల్లి ముందే జరగడంతో ఆమె దీన్ని చూసి తట్టుకోలేకపోయింది. అక్కడే ఉన్న మరో మహిళ అడ్డుపడేందుకు ప్రయత్నించగా.. ఆమెపై దాడి చేసేందుకు యత్నించాడు. 

ఇది గమనించిన స్థానికులు ఆ యువతికి కవర్లు కప్పారు.  ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ యువతికి రక్షణ కల్పించారు. నిందితుడు పెద్ద మారయ్యను అదుపుతోకి తీసుకొని విచారిస్తున్నారు.