అడవులను 33 శాతానికి పెంచుతం: మంత్రి కొండా సురేఖ

అడవులను 33 శాతానికి పెంచుతం: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో 24.05 శాతం ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. చెట్లు లేకుంటే పర్యావరణానికి ముప్పేనని చెప్పారు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గురువారం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి మాట్లాడారు. అడవులపై ప్రజలకు అవగాహన కలిగించేందుకే ఏటా ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 

చెట్లు లేకుంటే తలెత్తె విపత్కర పరిస్థితులను అవలోకనం చేసుకోవాల్సిన అవసరమున్నదన్నారు. పట్టణీకరణ, పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టుల నిర్మాణం, పోడు వ్యవసాయం, గృహాల నిర్మాణం వంటి కారణాలతో అడవులు నానాటికీ అంతరించి పోతున్నాయని కొండా సురేఖ వివరించారు. అడవుల విస్తరణ లేకపోవడంతోనే గ్లోబల్‌‌‌‌ ‌‌‌‌వార్మింగ్‌‌‌‌ ప్రభావంతో కఠిన సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. పర్యావణంలో సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నామని వెల్లడించారు.  వన్య ప్రాణులకు ఆవాసాలైన అడవులను కాపాడుకుంటేనే జీవవైవిధ్యం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు.