హైదరాబాద్ సిటీ, వెలుగు: మత్స్యకారుల ఆదాయం పెంచేలా ప్రభుత్వం స్కీములు ప్రవేశపెట్టాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు కోరారు. గురువారం నగరంలో మత్స్య కార్మిక సంఘం సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ లో మత్స్య రంగానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని, ప్రతీ మత్స్య సొసైటీ ఖాతాల్లో రూ.10 లక్షలు జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మత్స్య రంగంలోని 25 మంది ప్రముఖులను సత్కరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరెంకల నరసింహా, బాలకృష్ణ పాల్గొన్నారు.
