పవర్ జనరేషన్ పెంచిన్రు..సేఫ్టీ మరిచిన్రు

పవర్ జనరేషన్ పెంచిన్రు..సేఫ్టీ మరిచిన్రు

జనరేటింగ్ స్టేషన్ పై పెరిగిన ఒత్తిడి.. మెయింటెనెన్స్ కరువు

ఇదే ప్రమాదానికి కారణమంటున్న ఎంప్లాయీస్

హైదరాబాద్‌ , వెలుగు: శ్రీశైలం హైడల్‌ పవర్‌ ప్లాంట్‌‌లో జనరేషన్‌‌ పెంచి సెఫ్టీని పట్టించుకోకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇటీవల జనరేషన్‌‌ పెంచడంతో జనరేటింగ్‌ స్టేషన్‌‌లో ఒత్తిడి పెరిగింది. ఈ నెల 16న 20.26 మిలియన్‌‌ యూనిట్లు, 17న 20.59 మిలియన్ యూనిట్లు, 18న 20.86 మిలియన్ యూనిట్లు.. ఇలా పవర్‌ జనరేషన్‌‌ పెంచుకుంటూ పోయారు. ఈ నెలలోనే ఇప్పటివరకు 359.05 ఎంయూల విద్యుత్‌‌ జనరేషన్‌‌ జరిగింది.

ఒత్తిడి పెరిగి మంటలు!

పవర్​ జనరేషన్ పెంచడంతో జనరేటింగ్​ స్టేషన్ పై ఒత్తిడి పెరిగి ప్రమాదం జరిగి ఉండొచ్చని ఎంప్లాయీస్ అభిప్రాయపడుతున్నా రు. ఎక్సైట్‌‌మెంట్‌‌ ప్యానెల్‌ ద్వారా డైరెక్టు కరెంట్‌‌ను పవర్‌ ప్లాంట్‌‌ యూనిట్‌‌కు పంపిస్తారు. దీని ద్వారా పవర్‌ ప్లాంట్‌‌ను రన్‌‌ అప్‌ చేస్తారు. స్లోగా ఓల్టోజీ పెంచుతూ యూనిట్‌‌ను రన్‌‌ చేస్తారు. ఎక్సైట్‌‌మెంట్‌‌ ప్యానెల్‌ లో షార్ట్‌‌ సర్క్యూట్‌‌ అయి మంటలు వచ్చి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోం ది. ఒత్తిడి పెరిగి కేబుల్‌ లోని కాపర్‌ వేడికి పైనున్న ఇన్‌‌సూలేషన్‌‌లో ప్లాస్టిక్‌‌ నుంచి మంటలు వచ్చి ప్యానల్‌ బోర్డులు తగలబడ్డట్లు, ఆటోమేటిక్‌‌గా స్ప్రెడ్‌ అయి ఒకదానికి ఒకటి అంటుకుని తగలబడి పోయినట్లు తెలుస్తోంది.

మెయింటెనెన్స్‌‌ లోపమా..?

అత్యంత భద్రత కలిగిన యూనిట్‌‌లో ఒత్తిడి పెరిగిన సందర్భాల్లో ఇండికేషన్‌‌ వ్యవస్థ ఉంటుందని ఎంప్లాయీస్ చెబుతున్నారు. అయితే.. శ్రీశైలం పవర్​ ప్లాంట్ లో విద్యుత్‌‌ ఉత్పత్తిపైనే దృష్టి పెట్టి ప్రమాద హెచ్చరికలను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి . చాలాకాలంగా ఉన్న ఈ హైడల్‌ ప్రాజెక్టులో సేఫ్టీ అప్‌ గ్రెడేషన్‌‌ ఉండాలి. కానీ దాని మెయింటెనెన్స్​ సరిగ్గా లేకపోవడంతో, షార్ట్​ సర్క్యూట్ జరిగి ప్రమాదానికి కారణమైందని ఎంప్లాయీస్ అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. మరోవైపు ప్లాంట్ లో సరైన భద్రత పరికరాలు, అగ్ని ప్రమాదాన్ని నిరోధించే సరైన వ్యవస్థ లేదన్న ఆరోపణలు వస్తున్నాయి .

గ్రిడ్‌‌ రివర్స్‌‌ అయిందా?

గురువారం రాత్రి ప్లాంట్ లో డీసీ బ్యాటరీ బ్యాంక్‌‌ ద్వారా కంట్రోలింగ్‌ సప్లై ఆన్‌‌ ఆఫ్‌‌ చేపట్టారు. ఈడీసీ బ్యాటరీ బ్యాంకు పాతది. దీన్ని మార్చి కొత్తది ఏర్పాటు చేయడానికి గురువారం డే అండ్​ నైట్ రిపేర్లు నిర్వహించారు. దీంతో సడన్‌‌గా పవర్​ సప్లయ్ లో డిస్టెబెన్స్‌ వచ్చి, యూనిట్లన్నీ ట్రిప్‌ అయ్యాయని, బ్రేకర్లు ఓపెన్‌‌ కాక గ్రిడ్‌ రివర్స్‌ సప్లయ్‌‌ ప్యానెల్స్‌ కు వచ్చినట్లు ఎంప్లాయీస్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్లనే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.