తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ముగిసినప్పటికీ గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. తల్లుల దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ముందుగా మేడారం చేరుకున్న భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేశారు.
కల్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించారు. అనంతరం ఎత్తుబెల్లంతో దేవతల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత ఎదురుకోళ్లతో మొక్కుకుని వన భోజనాలు చేశారు. గద్దెల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
