
బ్రిటన్: టీమిండియాకు డూ ఆర్ డై లాంటి మ్యాచ్ అయినా మాంచెస్టర్ నాలుగో టెస్టులో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అనే సందిగ్ధానికి తెరపడింది. నాలుగో టెస్టులో బుమ్రా కచ్చితంగా ఆడతాడని తేల్చి చెప్పాడు మరో భారత పేసర్ మహ్మద్ సిరాజ్. సోమవారం (జూలై 21) నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిరాజ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇండియాకు కీలకమైన నాల్గో టెస్ట్ బుమ్రా ఆడతాడా లేదా అని జర్నలిస్టులు సిరాజ్‌ను ప్రశ్నించగా.. నాకు తెలిసింత వరకు ఫోర్త్ టెస్ట్ టీమిండియా ప్లేయింగ్ లెవన్‌లో బుమ్రా ఉంటాడని చెప్పాడు మియాబాయ్.
కాగా, ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో వర్క్ లోడ్ కారణంగా బుమ్రా ఏవైనా మూడు మ్యాచులు మాత్రమే ఆడతాడని బీసీసీఐ ముందుగానే చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఫస్ట్, థర్డ్ టెస్ట్ మ్యాచులు ఆడిన బుమ్రా.. రెండో టెస్ట్‌కు రెస్ట్ తీసుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా జరగునున్న నాలుగో టెస్ట్‌కు విశ్రాంతి తీసుకుని సిరీస్‌లో చివరి ఐదో టెస్ట్‌లో బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా సిరాజ్ ఇచ్చిన క్లారిటీతో ఈ ఊహాగానాలకు తెరపడింది.
లార్డ్స్‌లో భారత్ ఓటమిపైన మహమ్మద్ సిరాజ్ రియాక్ట్ అయ్యాడు. లార్డ్స్‌లో చివరి వరకు వచ్చి ఓడిపోవడంతో తాను చాలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు. టీమిండియా గెలుపు కోసం జడేజా చివరి వరకు పోరాడాడని కొనియాడారు. ఆస్ట్రేలియా టూర్ నుంచి బ్యాటింగ్‌పై దృష్టి పెట్టానని.. ఇకపై మరింత ఫోకస్ చేస్తానని చెప్పాడు. మ్యాచ్ లాస్ట్ వరకు వచ్చి 22 పరుగుల తేడాతో ఓడిపోవడం బాధకరమన్న సిరాజ్.. ఇప్పడే సిరీస్ ముగియలేదన్నాడు. మిగిలిన రెండు మ్యాచుల్లో బలంగా పుంజుకుంటున్నాడు.
ఇక, ఐదు మ్యాచుల సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో అతిథ్య ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి తొలి ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో విజయంతో కంబ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ 1-2 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 2025, జూలై 23న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాల్గో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్.. మాంచెస్టర్‌లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ జట్లు ఉవ్విళ్లురుతున్నాయి.