వడోదరా: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో తొలి వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన షర్ఫుద్దౌలాను ఐసీసీ ఈ మ్యాచ్‌కు టీవీ అంపైర్‌గా నియమించింది. రూల్స్ ప్రకారం ప్రతి వన్డేకు ఐసీసీ ఒక అంపైర్‌ను నియమిస్తుంది. వీళ్లు మ్యాచ్ ఆడుతున్న జట్ల దేశాలకు చెందినవారై ఉండకూడదు.
ఎలైట్ లేదా ఇంటర్నేషనల్ ప్యానెల్ నుంచి వీళ్లను ఎంపిక చేస్తారు. హోమ్ బోర్డు తమ సొంత లేదా ఎలైట్ ప్యానెల్ నుంచి ఒక అంపైర్‌ను ఏర్పాటు చేస్తుంది. డీఆర్‌ఎస్ ఉండే మ్యాచ్‌ల్లో ఐసీసీ మూడో అంపైర్‌ను కూడా నియమిస్తుంది. అత్యవసరమైతే అతను అంపైర్ బాధ్యతలను నిర్వహిస్తాడు. డీఆర్‌ఎస్‌ను కూడా అతనే చూస్తాడు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఇండియా నుంచి తరలించాలని బంగ్లా క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని ఐసీసీ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు.
