IND vs PAK: బచ్చాగాళ్లను కొట్టినట్లు కొట్టారు.. చూడలేకపోయా!: అక్తర్

IND vs PAK: బచ్చాగాళ్లను కొట్టినట్లు కొట్టారు.. చూడలేకపోయా!: అక్తర్

దాయాదుల పోరు ముగిసి 48 గంటలు గడుస్తున్నా.. ఆ వేడి మాత్రం ఇంకా చల్లారట్లేదు. పాకిస్తాన్ జట్టు ప్రదర్శనపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తిట్ల పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ  మ్యాచ్‌లో మొదట పాక్‍ను 191 పరుగులకే కట్టడి చేసిన భారత్.. అనంతరం లక్ష్య చేధనను 30.3 ఓవర్లలోనే చేధించింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌ను ఆ జట్టు మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఓటమిపై స్పందించిన అక్తర్.. తమ ఆటగాళ్లను బచ్చాగాళ్లను కొట్టినట్లు కొట్టారని మాట్లాడాడు.

బచ్చాగాళ్లను కొట్టినట్లు కొట్టారు

పాకిస్తాన్ ఓటమిపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అక్తర్.. భారత జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. సెమీఫైనల్‌లో తడబడకపోతే భారత జట్టు 2011 వరల్డ్ కప్ చరిత్రను రిపీట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. " వెల్ డన్ ఇండియా.. బాగా ఆడారు. మా వాళ్లను చావబాదారు. మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టారు. ఇది చాలా నిరాశాజనక ప్రదర్శన. రోహిత్ ఎప్పుడూ వన్ మ్యాన్ ఆర్మీనే. పాకిస్తాన్ బౌలింగ్ ఎటాక్‌ను  తుత్తునియలు చేశాడు. ఇన్నాళ్లు ఇతడు ఎక్కడున్నాడో నాకు అర్థం కావడం లేదు. రోహిత్.. పరిపూర్ణమైన బ్యాటర్. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ అవమానకర రీతిలో ఓడింది. బచ్చాగాళ్లను కొట్టినట్లు కొట్టారు. ఆ దృశ్యాలు నేను చూడలేకపోయా.." అని అక్తర్ తెలిపాడు.

రోహిత్ భయపెట్టాడు.. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదట భారత బౌలర్లు.. పాక్ ను192 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు) వీరవిహారం చేశాడు. పాక్ బౌలర్లను అంతర్జాతీయ బౌలర్లం అని చెప్పుకోకుండా కొట్టాడు. ఈ విజయంతో భారత్(+1.821) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.