
మొహాలీ : టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాప్రికా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. సఫారీలకు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్ ఢీకాక్ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా ప్లేయర్లు తక్కువ స్కోర్ కే పరిమిత మయ్యారు. మిల్లర్ (15) నిరాశ పరిచాడు. ఆ తర్వాత రెండో వికెట్ గా వచ్చిన బావుమా (49) ఫర్వాలేదనిపించడంతో సౌతాఫ్రికాకు ఆ మాత్రం స్కోర్ దక్కింది.
సౌతాఫ్రికా ప్లేయర్లలో..ఢీకాక్(52), బావుమా(49), డేవిడ్ మిల్లర్(15), ప్రిటోరియస్(10), ఫెలుక్వాయో(8) హెన్డ్రిక్స్(6), దుస్సెన్(1) రన్స్ చేశారు.
భారత బౌలర్లలో.. దీపక్ చాహర్(2), నవ్ దీప్ సౌనీ (1), పాండ్యా(1), రవీంద్ర జడేజా(1)లకు వికెట్లు దక్కాయి.
Innings Break!
South Africa post a total of 149/5 on board https://t.co/IApWLYsXvx #INDvSA pic.twitter.com/mwWxWkzyKc
— BCCI (@BCCI) September 18, 2019