ఫ్లైట్​లో అసభ్య ప్రవర్తన.. అమెరికాలో భారత సంతతి డాక్టర్​ అరెస్టు

ఫ్లైట్​లో అసభ్య ప్రవర్తన.. అమెరికాలో భారత సంతతి డాక్టర్​ అరెస్టు
  • గతేడాది మేలో జరిగిన ఘటనపై తాజాగా కేసు నమోదు
  • అలాంటి ఘటనేది తనకు గుర్తులేదంటున్న నిందితుడు

బోస్టన్: విమానంలో టీనేజీ అమ్మాయి పక్క సీట్లో ఉండగా అసభ్య చేష్టలు చేశాడనే ఆరోపణలతో ఇండియన్ అమెరికన్​ డాక్టర్​ను ఎఫ్​బీఐ(ఫెడరల్​బ్యూరో ఆఫ్​ఇన్వెస్టిగేషన్) అరెస్టు చేసింది. అయితే ఏడాది కింద జరిగిం దని ఆరోపిస్తున్న అలాంటి ఘటన ఏదీ తనకు గుర్తులేదని నిందితుడు చెప్తున్నాడు. గతేడాది మే నెలలో హొనొలులు నుంచి బోస్టన్ వెళ్తుండగా ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు యూఎస్ స్టేట్స్ అటార్నీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

 మసాచూసెట్స్​లోని కేంబ్రిడ్జ్​కు చెందిన డాక్టర్​సుదీప్త మహంతి(33) బోస్టన్ వెళ్లేందుకు హొనొలులులో హవాయి ఎయిర్​లైన్స్ విమానం ఎక్కారు. ఆయన పక్క సీట్లో 14 ఏండ్ల బాలిక ఉండగా ఫ్లైట్​లో ఇచ్చే దుప్పటి కప్పుకొని అసభ్య చేష్టలు ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత దుప్పటి తీసేసి బహిరంగంగానే కొనసాగించాడని బాలిక ఆరోపించింది. దీంతో తను మరో సీటుకు మారిపోయానని.. ఫ్లైట్ దిగగానే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పానని వివరించింది.

 గురువారం మహంతిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెటారు. అయితే అసలు తను అలా ప్రవర్తించలేదని, అలాంటి ఘటనేది తనకు గుర్తుకులేదని కోర్టుకు వివరించాడు. ప్రస్తుతం మహంతి బెయిలుపై విడుదలయ్యారు. నేరం రుజువైతే అతనికి 90 రోజుల వరకు జైలు శిక్ష, 5 వేల డాలర్ల జరిమానా విధించే చాన్స్ ఉంది.