ఫైనల్లో ఇండియా-ఎ.. అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌–ఎపై భారీ తేడాతో గెలుపు

ఫైనల్లో ఇండియా-ఎ.. అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌–ఎపై భారీ తేడాతో గెలుపు

దంబుల్లా: ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో ఆకట్టుకున్న ఇండియా–ఎ జట్టు.. ముక్కోణపు వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ (59),  ప్రియాన్షు ఆర్యా (58), కుమార్‌‌‌‌‌‌‌‌ కుశాగ్ర (58) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలతో చెలరేగడంతో.. బుధవారం జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా 101 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌–ఎపై గెలిచింది.

టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 319/9 స్కోరు చేసింది. వైభవ్‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ (38), రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ (30), విప్రజ్‌‌‌‌‌‌‌‌ నిగమ్‌‌‌‌‌‌‌‌ (30) రాణించారు. ఫరీదూన్ దావూద్‌‌‌‌‌‌‌‌జాయ్, అబ్దోల్లా అహ్మద్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌, ఫర్మానుల్లా తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌–ఎ 36.5 ఓవర్లలో 218 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది.

బహిర్‌‌‌‌‌‌‌‌ షా (57) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ఫైజల్‌‌‌‌‌‌‌‌ (46), ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌ మిర్‌‌‌‌‌‌‌‌ (32) పోరాడి విఫలమయ్యారు. నిశాంత్‌‌‌‌‌‌‌‌ సంధు 4, యష్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశారు. నిశాంత్‌‌‌‌‌‌‌‌ సంధుకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.