IND A vs AUS A: అయ్యర్ తప్ప అందరూ ఆడారు: తొలి టెస్ట్‌లో జురెల్ సెంచరీ.. ముగ్గురు హాఫ్ సెంచరీలు

IND A vs AUS A: అయ్యర్ తప్ప అందరూ ఆడారు: తొలి టెస్ట్‌లో జురెల్ సెంచరీ.. ముగ్గురు హాఫ్ సెంచరీలు

ఆస్ట్రేలియా ఏ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కుర్రాళ్ళు బ్యాటింగ్ లో దంచికొట్టారు. బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించి రెండో రోజు పటిష్ట స్థితిలో నిలిచారు. లక్నో వేదికగా శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత ఏ జట్టు 4 వికెట్ల నష్టానికి 403 పరుగులు చేసి ఆసీస్ పై ఆధిపత్యం చూపించారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో ఇండియా మరో 129 పరుగులు వెనకపడి ఉంది. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో అయ్యర్ సేనకు ఆధిక్యం గ్యారంటీగా కనిపిస్తోంది. 

అయ్యర్ విఫలం.. సెంచరీతో అదరగొట్టిన జురెల్:

ఈ మ్యాచ్ లో మొదట బౌలింగ్ లో రాణించలేకేపోయిన టీమిండియా బ్యాటింగ్ లో మాత్రం ఆకట్టుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ (113*) సెంచరీతో కంగారూల బౌలర్లను అలవోకగా ఆడేశాడు. జురెల్ కు దేవదత్ పడిక్కల్ (86*) చక్కని సహకారమందించాడు. ఐదో వికెట్ కు వీరిద్దరూ అజేయంగా 181 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి రోజును ముగించారు. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (44), జగదీసన్ (64) తొలి వికెట్ కు 88 పరుగులు జోడించి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటైనా సాయి సుదర్శన్, పడికల్ భాగస్వామ్యం ఇండియాను నిలబెట్టింది. 

ALSO READ : WAC 2025: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్.. ఇండియా ఆశలు సజీవంగా ఉంచిన సచిన్ యాదవ్

వీరిద్దరూ మూడు వికెట్ కు 76 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నారు. ఈ దశలో ఒక్కసారిగా ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. హాఫ్ సెంచరీ చేసి మంచి టచ్ లో కనిపించిన సాయి సుదర్శన్ (73) ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే శ్రేయాస్ అయ్యర్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఈ దశలో ఆస్ట్రేలియా పై చేయి సాధించింది. అయితే  ఐదో వికెట్ కు జురెల్, పడిక్కల్ అజేయంగా 181 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియాను టాప్ లో ఉంచారు. 

తొలి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా భారీ స్కోర్: 

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఏ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి రోజు యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనర్ సామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (144 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో109) మెరుపు సెంచరీతో ఆకట్టుకోవడంతో ఇండియా–ఎతో తొలి అనధికారిక టెస్టును ఆస్ట్రేలియా–ఎ మెరుగ్గా ఆరంభించింది. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ రెండో రోజు 87 బంతుల్లోనే 123 పరుగులు చేసి ఆసీస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియా బౌలర్లలో హర్ష దూబే 3 వికెట్లతో రాణించాడు. గుర్నార్ బ్రార్ కు రెండు వికెట్లు దక్కాయి.