అగ్ని 5 విజయవంతం : DRDO సైంటిస్టులకు ప్రధాని మోదీ అభినందనలు

అగ్ని 5 విజయవంతం  :  DRDO సైంటిస్టులకు ప్రధాని  మోదీ అభినందనలు

భారత ప్రధాని మోదీ సోమవారం డీఆర్డీఓ శాస్తవేత్తలను అభినంధించారు. ఇండియన్ డిఫెన్స్ సామర్థ్యం పెరుగుతుందని అభివర్ణించారు. ఇండియాలో స్వదేశంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి మొదటి టెస్ట్ ఈరోజు విజయవంతమైందని తెలిపారు. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ సైంటిస్టులను ప్రధాని ఎక్స్ వేదికగా అభినందించారు.

మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) టెక్నాలజీతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి యొక్క మొదటి ఫ్లైట్ టెస్ట్ మిషన్ దివ్యాస్త్ర కోసం మా DRDO శాస్త్రవేత్తలు గర్వపడుతున్నారని మోడీ అధికారిక X హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. 

తాజా పరీక్షతో, భారతదేశం అధికారికంగా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ (MIRV) సామర్ధ్యాన్ని కలిగి ఉన్న దేశాల సరసన చేరింది.   అగ్ని -5 మిస్సెల్ 5,500 నుండి 5,800 కిలోమీటర్ల టార్గెట్ ను చేరుకోగలదు. ఇది భారతదేశ వ్యూహాత్మక రక్షణ ఆయుధాగారంలో కీలకమైన వృద్ధిగా చెప్పుకోవచ్చు.