
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, ఎలక్టోరల్ బాండ్ ఇష్యూ పై ప్రతిపక్ష ఇండియా కూటమి శుక్రవారం మార్చి29 నాడు దేశ రాజదానిలో నిరసనలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనలు తెలపనున్నారు. 2024, మార్చి 31న సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రాంలీలా మైదాన్‌లో ఉమ్మడి ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇండియా బ్లాక్ ప్రకటించింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ మాట్లాడుతూ
"ప్రజాస్వామ్యం, దేశం ఆసన్నమైన ముప్పులను ఎదుర్కొంటోంది. భారత కూటమికి చెందిన అన్ని పార్టీలు ఈ గొప్ప కార్యక్రమాలలో చేరతాయి. దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ర్యాలీ నిర్వహిస్తాము" అని అన్నారు.
ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్.. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు నిరసనగా మార్చి 31 (ఆదివారం) రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భారత కూటమికి చెందిన ప్రముఖ నాయకులు చురుకుగా పాల్గొంటారు అని తెలిపారు.