అగర్తల గడ్డపై ‘ఇండియా’ కూటమి శంఖారావం : సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ 

అగర్తల గడ్డపై ‘ఇండియా’ కూటమి శంఖారావం : సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ 

అగర్తల: దేశంలో పౌరుల ఓటు హక్కును కాలరాసేలా కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ‘ఇండియా’ కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందులో భాగంగా త్రిపుర రాజధాని అగర్తల వేదికగా అక్టోబర్ 30న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కూటమి నాయకులు ప్రకటించారు. సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, సర్​పేరుతో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులందరికీ తిరిగి చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

శనివారం  అగర్తల ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో ప్రతిపక్ష నేత జితేంద్ర చౌధురి, త్రిపుర టీపీసీసీ అధ్యక్షుడు ఆశిష్ కుమార్ సాహా మీడియాతో మాట్లాడారు. సర్​ ప్రక్రియ దేశాన్ని జాతీయ సంక్షోభం వైపు నడిపిస్తోందని జితేంద్ర చౌధురి మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సర్​ముసుగులో ఇప్పటివరకు 13 కోట్ల మందికి పైగా ఓటర్ల హక్కులను కాలరాశారని ఆరోపించారు. బీజేపీని గెలిపించే లక్ష్యంతోనే పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు సీఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్, బిహార్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ సర్​కుట్రకు తెరలేపారన్నారు.