
ఆదివారం (సెప్టెంబర్ 14) రెండు ఇండియా క్రికెట్ మ్యాచ్ లు ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇవ్వనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఇండియా క్లియర్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ టోర్నీకే ప్రధాన ఆకర్షణగా మారనుంది. మ్యాచ్ సాయంత్రం 8 గంటలకు జరగనుంది. సోనీ స్పోర్ట్స్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతోంది.
ఆసియా కప్ కు ఇండియా స్క్వాడ్:
అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, సంజు శాంసన్, రింకు సింగ్, అర్ష్‌దీప్, అర్ష్‌దీప్, అర్ష్‌దీప్.
ఆస్ట్రేలియా మహిళలతో ఇండియా మహిళలు ఢీ:
ఐసీసీ వరల్డ్ కప్ కు ముందు టీమిండియా మహిళల జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆదివారం (సెప్టెంబర్ 14) నుంచి ప్రారంభం కానుంది. చండీఘర్ లోని మూలాన్ పూర్ క్రికెట్ స్టేడియంలో తొలి వన్డే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 17 న రెండో వన్డే.. సెప్టెంబర్ 20 న మూడో వన్డే జరగనుంది. సెప్టెంబర్ 30 ఉంచి ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాను ఓడించి ఆత్మవిశ్వాసంతో వరల్డ్ కప్ లో అడుగుపెట్టాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది.
►ALSO READ | Asia Cup 2025: బ్యాటింగ్‌లో తడబడిన పాకిస్థాన్.. ఒమన్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (విసి), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే, రాధా యాదవ్, శ్రీ చరణి (వికెట్ కీపర్), యాస్తిక్ భాటియా (వికెట్ కీపర్), స్నేహ రానా