తడబడ్డ భారత్ బ్యాటింగ్ : ఆస్ట్రేలియా టార్గెట్-127

తడబడ్డ భారత్ బ్యాటింగ్ : ఆస్ట్రేలియా టార్గెట్-127

ముంబై : ఫస్ట్ టీ20లో భారత్ తడబడింది. ఆసిస్ బౌలర్ల దెబ్బకి తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

బెహ్రెన్‌ డోర్ఫ్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ(5) అడం జంపాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 55 పరుగులు జోడించారు. అయితే ఆడం జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌ కు ప్రయత్నించి కోహ్లీ(24) కౌంటర్‌-నైల్‌ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్(3).. అనవసరంగా పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. డి ఆర్కీ షాట్ వేసి పదో ఓవర్ చివరి బంతికి రిషబ్ అత్యంత చెత్తగా రనౌటై వెనుదిరిగాడు. ఆ తర్వాత లోకేశ్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించి.. ఆ వెంటనే ఔట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌ కి వచ్చిన దినేశ్ కార్తీక్(1), కృనాల్ పాండ్యా(1) తక్కువ స్కోర్‌ కే పరిమితమయ్యారు. చివర్లో ధోనీ.. పరుగులు సాధించేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.