రోటర్‌డ్యామ్: ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో ఇండియా జట్టు దూసుకుపోతోంది. సీనియర్ ప్లేయర్ సరికొత్త రికార్డు సృష్టించిన వేళ.. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండియా 3–1 తేడాతో బలమైన జర్మనీపై గెలిచింది. ఇండియా తరఫున మన్‌దీప్ సింగ్ (7వ ని), శిలానంద్ లక్రా (13వ ని), నీలకంఠ శర్మ (35వ ని) గోల్స్ చేయగా, రాఫెల్ హార్ట్‌కాఫ్ (45వ ని) జర్మనీకి ఏకైక గోల్ అందించాడు.
అలాగే ఇండియా తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా మన్‌ప్రీత్ (413) సరికొత్త రికార్డు సృష్టించాడు. సుదీర్ఘ కాలంగా ఉన్న దిలీప్ టిర్కే (412) రికార్డును బ్రేక్ చేశాడు. ఆట ఆరంభం నుంచే అద్భుతంగా ఆడిన ఇండియా డిఫెండర్లు.. జర్మనీ ఎదురుదాడులను సమర్థంగా నిలువరిస్తూ గోల్స్ అవకాశాలను సృష్టించారు.
ఏడో నిమిషంలోనే మన్‌ప్రీత్ అందించిన పాస్‌ను మన్‌దీప్ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత శిలానంద్ లక్రా అద్భుతమైన ఫీల్డ్ గోల్ జర్మనీ కీపర్ అలెగ్జాండర్ స్టాడ్లర్‌ను బోల్తా కొట్టించాడు. రెండో క్వార్టర్‌లో జర్మనీ పుంజుకోవడానికి ప్రయత్నించి రెండు పెనాల్టీ కార్నర్లు సాధించినప్పటికీ, ఇండియా డిఫెండర్ అమిత్ రోహిదాస్, గోల్‌కీపర్ మోహిత్ వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నారు.
మూడో క్వార్టర్‌లో నీలకంఠ శర్మ ఒంటరి పోరాటంతో జర్మనీ డిఫెండర్లను దాటుకుంటూ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి స్కోరును 3–-0కు చేర్చాడు. ఆ తర్వాత 45వ నిమిషంలో జర్మనీ ఆటగాడు రాఫెల్ హార్ట్‌కాఫ్ ఒక గోల్ సాధించి తమ జట్టు ఖాతా తెరిచాడు. చివరి నిమిషాల్లో జర్మనీ జట్టు మ్యాచ్‌ను డ్రా చేయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ సక్సెస్ కాలేదు.
