జూనియర్ ఆసియా కప్‌లో టీమిండియా బోణీ.. సౌత్ కొరియాపై 4–1తో గెలుపు

జూనియర్ ఆసియా కప్‌లో టీమిండియా బోణీ.. సౌత్ కొరియాపై 4–1తో గెలుపు

మోఖి (చైనా): విమెన్స్‌‌‌‌ జూనియర్‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఇండియా బోణీ చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌లో ఇండియా 4–1తో సౌత్‌‌‌‌ కొరియాపై గెలిచింది. సనిక చంద్రకాంత్‌‌‌‌ (8వ నిమిషం), పూర్ణిమ యాదవ్‌‌‌‌ (30వ ని), పూజ సాహు (45వ ని), మధు సిదార్‌‌‌‌ (51వ ని) ఇండియాకు గోల్స్‌‌‌‌ అందించారు. సౌత్‌‌‌‌ కొరియా తరఫున కిల్‌‌‌‌ గాబిన్‌‌‌‌ (57వ ని) ఏకైక గోల్‌‌‌‌ కొట్టాడు. మ్యాచ్‌‌‌‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండియన్‌‌‌‌ ఫార్వర్డ్స్‌‌‌‌.. సౌత్‌‌‌‌ కొరియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని పెనాల్టీలను సృష్టించారు.