బొగ్గు గ్యాసిఫికేషన్‌‌‌‌‌‌‌‌ స్కీంకు దరఖాస్తులు రాలేదనడం అబద్ధం ..కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ వెల్లడి

బొగ్గు గ్యాసిఫికేషన్‌‌‌‌‌‌‌‌ స్కీంకు దరఖాస్తులు రాలేదనడం అబద్ధం ..కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి దరఖాస్తులు రాలేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తొలి దశ దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 7 వరకు గడువు ఉందని, ఆ తేదీ ముగియకముందే దరఖాస్తులు రాలేదనడం తొందరపాటు నిర్ణయమని తెలిపింది. టాల్చర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (టీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్), ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ లిమిటెడ్ సంస్థలు ఇప్పటికే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తులు సమర్పించాయని పేర్కొంది.

దేశీయ బొగ్గు, లిగ్నైట్‌‌‌‌‌‌‌‌ను సింగ్యాస్, మిథనాల్, అమ్మోనియా, యూరియా వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చడాన్ని ప్రోత్సహించడం ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యమని శనివారం వెల్లడించింది. పరిశ్రమ వర్గాల్లో ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు న్యూఢిల్లీ, హైదరాబాద్, ముంబైలలో రోడ్‌‌‌‌‌‌‌‌షోలు నిర్వహించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ.37,500 కోట్ల ఆర్థిక కేటాయింపులతో రూపొందించిన ఈ పథకానికి 2026 మే 13న కేంద్ర కేబినెట్ ఆమోదం లభించిందని ప్రస్తావించింది.