పార్లమెంట్ ముందు సోనియా, రాహుల్ నిరసన

పార్లమెంట్ ముందు సోనియా, రాహుల్ నిరసన

 పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు  నిరసకు దిగారు . పార్లమెంట్ ఓల్డ్ బిల్డింగ్ నుంచి కొత్త భవనం వరకు ర్యాలీ తీశారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో రూల్స్ పాటించలేదంటూ అభ్యంతరం తెలిపారు.  రాజ్యాంగం కాపీలను చేతుల పట్టుకుని గాంధీ విగ్రహం దగ్గర కాసేపు నిరసన చేపట్టారు. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. మోదీ రాజ్యాంగానికి విలువ ఇవ్వడం లేదంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా మోదీ పాలన సాగిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.  అనంతరం  రాహుల్ సహా కూటమి సభ్యులు లోక్ సభలోకి వెళ్లారు.

 మోదీ  రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని..అందుకే  ఇవాళ అన్ని పార్టీల నేతలు ఏకమై నిరసనలు తెలుపుతున్నామని మల్లికార్జున ఖర్గే అన్నారు.   మోడీ  రాజ్యాంగం ప్రకారం ముందుకు సాగాలన్నారు. ఇంకెంత కాలం  మోదీ పదే పదే  ఎమర్జెన్సీ గురించి మాట్లాడి పబ్బం గడుపుకుంటారని  ప్రశ్నించారు. ఇప్పటికే వంద సార్లు ఎమర్జెన్సీ గురించి మాట్లాడారని అన్నారు.