
అబర్నెల్(అమెరికా): ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో ఇండియా మెన్స్ రికర్వ్ టీమ్ రజత పతకంతో మెరిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బొమ్మదేవర ధీరజ్–తరుణ్‌దీప్ రాయ్–అటాను దాస్‌తో కూడిన ఇండియా త్రయం 1–5తో చైనా (లి జోంగ్‌యాన్–కావో వెన్‌చావో–వాంగ్ యాన్) చేతిలో ఓడి రెండో ప్లేస్‌తో సరిపెట్టింది. చైనాకే బ్రాంజ్ మెడల్ కూడా దక్కింది. మెన్స్ కాంపౌండ్ ఇండివిడ్యువల్ సెక్షన్‌లో అభిషేక్ వర్మ తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు.