ప్రధాని మోడీ,కేంద్రంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. మోడీ పాలనలో దేశ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.
భారత్‌లో ఆకలి కేకలు తీవ్రంగా ఉన్నాయని గ్లోబల్ హంగర్ ఇండెక్స్(జీహెచ్‌ఐ) స్పష్టం చేసింది. జీహెచ్ఐ 2020 జాబితాలో ఇండియా సీరియస్ హంగర్ క్యాటగిరీలో ఇండియా 94వ స్థానంలో నిలిచింది. అలాగే చైల్డ్ వెస్టింగ్ రేటు 17.3 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఐదేళ్లలోపు శిశు మరణాల రేటు 3.7 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. అయితే పుట్టుకతో వచ్చే అనారోగ్య సమస్యలతో వల్ల చనిపోయే చిన్నారుల సంఖ్య చాలావరకు తగ్గినట్లు సర్వేలో తేలింది. ఐదేళ్లలోపు శిశువుల మరణాల రేటు కూడా తగ్గిందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తెలిపింది.
అయితే ఈ సర్వేపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆకలి మరణాలు,పిల్లల నిజ జీవితాల గురించి తెలుసుకుంటే హృదయవిదారకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గూడౌన్లలో ఆహార ఉత్పత్తులు ఎక్కువగా ఉంటే ఈ ఆకలి కేకలు ఇలా ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.
2014నుంచి మనదేశం యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్ పడిపోతున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు 102/117 కు చేరిందన్నారు. ఈ ర్యాంకింగ్ ప్రభుత్వ విధానంలో భారీ వైఫల్యాన్ని గుర్తు చేస్తున్నాయన్నారు. మోడీ చేపట్టిన సబ్కావికాస్ లక్ష్యాల్ని చేరుకోవడంలో విఫలమైందని చెప్పారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యొక్క 2019 నివేదికలో నేపాల్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ తరువాత స్థానంలో భారత్ ఉందన్న రాహుల్ గాంధీ.. భారతదేశంలో ప్రతి ఐదుగురు పిల్లలలో ఒకరు ఎత్తు,బరువు తక్కువగా ఉండడం ఆందోళన చెందాల్సిన అంశమేనని అన్నారు.
