
పుణె: భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు టెస్ట్ ల సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది. దీంతో మూడో టెస్టు ఆడకుండానే సిరీస్ ను కైవసం చేసుకుంది. నాల్గో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌కు దిగిన దక్షిణాఫ్రికాను 67.2 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ చేసింది టీమిండియా. 137 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసింది.