Hasan Nawaz: ఆసియా క్రీడల (Asian Games) ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓటమి చెందడం తనను ఇంకా వెంటాడుతూనే ఉందని పాకిస్థాన్ యువ బ్యాటర్ హసన్ నవాజ్ (Hasan Nawaz) ఆవేదన వ్యక్తం చేశారు. జపాన్ వేదికగా జరిగిన పురుషుల క్రికెట్ పోటీల ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో పాక్ ను ఓడించి స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. ఆ టైటిల్ పోరులో అద్భుతంగా ఆడి 96 రన్స్ కొట్టిన నవాజ్.. తాము చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్లే విజయాన్ని చేజార్చుకున్నామని పేర్కొన్నాడు.
ఆ ఓటమి బాధ నుంచి ఇంకా కోలుకోలేదు: హసన్ నవాజ్
ఫైనల్ మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నా ఆ పరాజయం తనను ఇంకా బాధిస్తోందని పాక్ స్టార్ ఓపెనర్ నవాజ్ మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఫైనల్లో గెలవలేకపోయామన్న నిరాశ, బాధ ఇప్పటికీ అలాగే ఉంది. మ్యాచ్‌లో మేం చేసిన చిన్న చిన్న పొరపాట్లే మా కొంపముంచాయి, అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నామని వాపోయారు. నంబర్-1 జట్టు అయిన భారత్‌తో తలపడడం ఎప్పుడూ కష్టమేనని, అయితే తాము ఈ మ్యాచ్‌లో గెలుస్తామని గట్టిగా నమ్మామని నవాజ్ తెలిపాడు.
బుమ్రా ఓవర్.. రన్ ఛేజ్ వ్యూహం:
భారత్‌తో జరిగిన ఆ ఉత్కంఠభరితమైన ఫైనల్ రన్ ఛేజ్ గురించి హసన్ నవాజ్ మాట్లాడుతూ.. నేను పరిస్థితికి తగినట్టుగా బ్యాటింగ్ చేశాను.. చివరిలో జస్ప్రీత్ బుమ్రా వేయాల్సిన ఒకే ఒక ఓవర్ మిగిలి ఉంది, భారత్ బౌలింగ్ పరంగా కాస్త ఇబ్బందిలో ఉందని నాకు తెలుసు.. కానీ ఛేదనలో మేం కొన్ని పొరపాట్లు చేసి మ్యాచ్‌ను కోల్పోయామని వివరించాడు. ఏదేమైనా ప్రపంచ నంబర్-1 జట్టుపై ఈ స్థాయి ఇన్నింగ్స్ ఆడడం వ్యక్తిగతంగా తనకు సంతృప్తినిచ్చిందని, గత ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న తాను ఈ రీఎంట్రీని ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
తప్పుల నుంచి నేర్చుకుంటాం:
భారత్‌తో మ్యాచ్ ముగిసిపోయిందని, క్రికెట్ ఎప్పుడూ ఆగదని నవాజ్ పేర్కొన్నాడు. మళ్లీ తప్పులు చేస్తాం, కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత మెరుగైన ఆటగాళ్లుగా మారుతామని ధీమా వ్యక్తం చేశారు. గడ్డి పిచ్‌లు, కఠినమైన పరిస్థితుల్లో ఆడిన అనుభవం తనను మెరుగైన బ్యాటర్‌గా మార్చిందని వెల్లడించాడు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా, త్వరలో జరగనున్న శ్రీలంక, ఇంగ్లాండ్ వైట్-బాల్ హోమ్ సిరీస్‌లపైనే ప్రస్తుతం తన దృష్టిసారించినట్లు హసన్ నవాజ్ పేర్కొన్నాడు.
HASAN NAWAZ ON INDIA TEAM 🇵🇰 “India is the No. 1 team, everyone knows that. I gained a lot of confidence after the knock.” “When I was travelling from the CPL to Japan, I had already planned that I wanted to do something special for Pakistan and bring a gold medal home. I couldn’t do it, and I’m very disappointed about that.”
— Talha Nawaz (@TalhaDigital007) October 7, 2026
