న్యూఢిల్లీ: కిందటి నెలలో భారత ఎగుమతులు ఏడాది లెక్కన 6.7శాతం పెరిగి 35.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతులు 10.12శాతం తగ్గి 61.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో ఎగుమతులు 32.89 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 68.53 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఆగస్టులో వాణిజ్య లోటు 26.49 బిలియన్ డాలర్లకు తగ్గింది. గత ఏడాది ఆగస్టులో ఈ నెంబర్ 35.64 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టులో మొత్తం ఎగుమతులు 184.13 బిలియన్ డాలర్లు, దిగుమతులు 306.52 బిలియన్ డాలర్లు. గ్లోబల్‌గా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఎగుమతిదారులు మంచి ప్రదర్శన చేశారని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ అన్నారు.

అమెరికాకు తగ్గిన ఎక్స్‌పోర్ట్స్
అమెరికాకు భారత ఎగుమతులు ఈ ఏడాది జులైతో పోలిస్తే ఆగస్టులో 14శాతం తగ్గి 8 బిలియన్ డాలర్ల నుంచి 6.86 బిలియన్ డాలర్లకు చేరాయి. ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు 7, 27న రెండు విడతలుగా 50శాతం టారిఫ్‌లు విధించడంతో ఎక్స్‌పోర్ట్స్ పడిపోయాయి. అయినప్పటికీ, అమెరికా భారత ఎగుమతులకు ప్రధాన గమ్యస్థానంగా కొనసాగుతోంది. వార్షికంగా చూస్తే 7.15శాతం వృద్ధి ఉంది. చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం.10.9 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి అయ్యాయి.