ఫినిషింగ్ ప్చ్…! ఇండియా స్కోరు 314/9

ఫినిషింగ్ ప్చ్…! ఇండియా స్కోరు 314/9

బర్మింగ్ హామ్ : హార్డ్ హిట్టర్లు ఫ్లాపయ్యారు.. ధోనీ భారీ షాట్లు ఆడటంలో మళ్లీ ఫెయిలయ్యాడు.. ఫలితంగా.. టాప్ ఆర్డర్ దుమ్ములేపినా కూడా… టీమిండియా స్లాగ్ ఓవర్లలో సత్తా చాటలేకపోయింది. ఫలితంగా భారీ స్కోరు సాధిస్తుందనుకున్న ఇండియా.. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 రన్స్ మాత్రమే చేసింది.

బంగ్లాదేశ్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా మామూలు స్కోరుతో సరిపెట్టింది. 29.2 ఓవర్లలోనే 180 రన్స్ తొలి వికెట్ భాగస్వామ్యంతో రోహిత్ శర్మ(104), కేఎల్ రాహుల్(77) బ్రిలియంట్ పునాది వేసినప్పుడు.. ఇండియా స్కోరు కనీసం 350 దాటుతుందని అంచనా వేశారు అందరూ.  రిషభ్ పంత్ మినహా తర్వాత వచ్చిన ఆటగాళ్లు భారీ షాట్లు ఆడలేకపోయారు.

కోహ్లీ 26, రిషభ్ పంత్ 48 రన్స్ మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఫినిషర్ అనిపించుకునే ధోనీ.. చివరి ఓవర్లో ఔటైనా… మెరుపు ముగింపు ఇవ్వడంలో మరోసారి ఫెయిలయ్యాడు. 33 బాల్స్ లో 4 ఫోర్లతో 35 రన్స్ చేసి లాస్ట్ ఓవర్ లో ధోనీ ఔటయ్యాడు.

హార్దిక్ పాండ్యా 0, కార్తీక్ 8, భువీ 2 , షమీ 1 రన్ చేసి ఔటయ్యారు.

చివరి పది ఓవర్లలో భారత ఆటగాళ్ల వైఫల్యం.. బంగ్లాదేశ్ కు కలిసొచ్చింది. వికెట్లు పడగొట్టడంలో వాళ్లు సక్సెస్ అయ్యారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ 5 వికెట్లు పడగొట్టాడు. షకీబ్, రుబెల్, సౌమ్య తలో వికెట్ తీసుకున్నారు.