ఇండియాలో తొలి స్పోర్ట్స్ బ్రెయిన్ ట్రైనింగ్ ల్యాబ్‌ షురూ

ఇండియాలో తొలి స్పోర్ట్స్ బ్రెయిన్ ట్రైనింగ్ ల్యాబ్‌ షురూ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీ, సిక్స్ ఎస్ స్పోర్ట్స్ సంస్థ  ఇండియాలో  తొలి స్పోర్ట్స్ బ్రెయిన్ ట్రైనింగ్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించాయి. ఈ ల్యాబ్​ వర‌‌‌‌‌‌‌‌ల్డ్ క్లాస్ ఎడ్యుకేష‌‌‌‌‌‌‌‌న్​తో పాటు అత్యుత్తమ స్పోర్ట్స్ ట్రైనింగ్ అందించనుంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్‌‌‌‌‌‌‌‌ పుల్లెల్ల గోపీచంద్, మాజీ క్రికెటర్‌ ఎమ్మెస్కే ప్రసాద్,  మాజీ అథ్లెట్‌ అంజు బాబీ బార్జ్‌‌‌‌‌‌‌‌ సమక్షంలో  ల్యాబ్ ఏర్పాటుకు వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీ, సిక్స్ ఎస్ స్పోర్ట్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ల్యాబ్‌లో  గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ, అంజూ బాబీ జార్జ్ స్పోర్ట్స్ ఫౌండేషన్, కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ అకాడమీ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్స్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయని వోక్సెన్ యూనివ‌‌‌‌‌‌‌‌ర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రౌల్ రోడ్రిగ్జ్ , సిక్స్ ఎస్ స్పోర్ట్స్  బిజినెస్ సొల్యూషన్స్ డైరెక్టర్  ఆంటోనీ చాకో ప్రకటించారు.