
సౌతాంప్టన్: వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ముంగిట టీమిండియా ప్రాక్టీస్‌లో ముగినిపోయింది. సౌతాఫ్రికాతో బుధవారం జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్ వేటను ఆరంభించనున్న కోహ్లీసేన అందుకోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఆదివారం జిమ్‌కు పరిమితమైన క్రికెటర్లు సోమవారం మైదానంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ధోనీ, రోహిత్ శర్మ నెట్స్‌లో భారీ షాట్లు కొడుతూ కనిపించారు. భువనేశ్వర్, ఇతర బౌలర్లు వారికి బంతులు విసిరారు. ముఖ్యంగా రోహిత్ షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడంపై దృష్టి సారించాడు. షమీ, నెట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ షార్ట్ బాల్స్ సంధించగా రోహిత్ అలవోకగా ఎదుర్కొన్నాడు. ఇక, స్పిన్నర్ చహల్ బౌలింగ్‌లో చాలా సార్లు బంతిని స్టాండ్స్‌లోకి కొట్టాడు. అయితే, త్రో డౌన్స్ ఎదుర్కొనే సమయంలో ఓ బంతి గ్లోవ్స్‌కు తాకడంతో అతను నొప్పితో బాధపడ్డాడు. దాంతో, సపోర్ట్ స్టాఫ్ వచ్చి చెక్ చేశారు. కాసేపటి తర్వాత మళ్లీ బ్యాట్ పట్టిన రోహిత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ చేశాడు.
డోప్ టెస్ట్‌కు బుమ్రా..
ప్రెస్‌మీట్ బైకాట్ చేసిన మీడియా
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సోమవారం డోప్ టెస్ట్‌కు హాజరయ్యాడు. నాడాతో ఇండియా క్రికెటర్లకు ఇబ్బందులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ టోర్నీలో రోటిన్ టెస్ట్‌ల్లో భాగంగా వాడా గుర్తింపు ఉన్న ఏజెన్సీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, టీమిండియా ప్రెస్‌మీట్‌ను ఇండియా మీడియా బైకాట్ చేసింది. మీడియా సమావేశాలకు కోచ్‌లు లేదా టీమ్ సభ్యులు రావడం ఆనవాయితీ. సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు రవిశాస్త్రి లేదా సీనియర్ ప్లేయర్ వస్తాడని అనుకుంటే నెట్ బౌలర్లు దీపక్ చహర్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ రావడంతో ప్రెస్‌మీట్‌ను మీడియా ప్రతినిధులు బైకాట్ చేశారు.