ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. శుక్రవారం (జనవరి 23) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఫస్ట్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో గ్రాండ్ విక్టరీ అందుకున్న సూర్యకుమార్ సేన అదే జోరును రాయ్‌పూర్‌లోనూ కొనసాగించి సిరీస్‌లో 2–0తో ముందంజ వేయాలని చూస్తోంది.
మరోవైపు, వన్డే సిరీస్ విజేతగా నిలిచిన కివీస్ షార్ట్ ఫార్మాట్‌లోనూ పుంజుకుని లెక్క సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో స్పిన్నర్ హర్షిత్ రానా జట్టులోకి వచ్చాడు. ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11 లోచోటు దక్కించుకున్నాడు.
►ALSO READ | RCB: ప్రీతి జింటా, జూహ్లీచావ్లా, శిల్పాశెట్టి బాటలో కోహ్లీ భార్య అనుష్క: బాలీవుడ్ టూ IPL టీం ఓనర్..?
🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bowl first in the 2⃣nd T20I.
— BCCI (@BCCI) January 23, 2026
Updates ▶️ https://t.co/8G8p1tq1RC#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/AcBcPlcKFZ
