RCB: ప్రీతి జింటా, జూహ్లీచావ్లా, శిల్పాశెట్టి బాటలో కోహ్లీ భార్య అనుష్క: బాలీవుడ్ టూ IPL టీం ఓనర్..?

RCB: ప్రీతి జింటా, జూహ్లీచావ్లా, శిల్పాశెట్టి బాటలో కోహ్లీ భార్య అనుష్క: బాలీవుడ్ టూ IPL టీం ఓనర్..?

IPLలో బిగ్ డెవలప్ మెంట్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. RCB కొనుగోలు చేయటానికి అనుష్క శర్మ సన్నాహాలు చేస్తున్నారంట.. అవును.. ఇప్పుడు క్రికెట్ వర్గంలో ఇదే హాట్ టాపిక్. అనుష్క శర్మ ఎవరో తెలుసు కదా.. విరాట్ కోహ్లీ భార్య. కోహ్లీ సైతం ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్నాడు. IPL కప్ ను ఫస్ట్ టైం కైవసం చేసుకున్న కోహ్లీ సేన.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటతో పరువు తీసుకున్నది. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో.. ఆర్సీబీ యాజమాన్యం చాలా సార్లు వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా ఆర్సీబీ జట్టును కోహ్లీ భార్య అనుష్క శర్మ కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ స్టార్ క్రికెటర్ విరాట కోహ్లీ భార్య, బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ బ్యూటీ అనుష్క శర్మ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.  RCB వాటా కోనేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. అనుష్క శర్మ RCB ఫ్రాంచైజీలో 3 శాతం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే అనుష్క శర్మ కూడా ప్రీతీ జింటా, జూహ్లీచావ్లా, శిల్పాశెట్టి బాటలో చేరనుంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కు ప్రీతీ జింటా, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శిల్పాశెట్టి, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు జూహ్లీచావ్లా కో ఓనర్ గా వ్యవహరించారు. తాజాగా ఈ లిస్ట్ లోకి కోహ్లీ భార్య అనుష్క శర్మ రావడం వైరల్ గా మారుతోంది. 

Also Read :  వరల్డ్ కప్ స్క్వాడ్ ఇదేనా

ఐపీఎల్ ప్రారంభమైన 18 సంవత్సరాల తర్వాత గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలుచుకొని ట్రోఫీ కలను నెరవేర్చుకుంది. దీంతో RCB బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. గత సీజన్ లో టైటిల్ గెలిచిన తర్వాత RCB బ్రాండ్ వాల్యూ 18.5 శాతం పెరగడంతో ప్రస్తుతం ఆ జట్టు బ్రాండ్ వాల్యూ 2 వేల 327 కోట్లకు చేరింది. RCB ఫ్రాంఛైజీ ఓనర్ డియాజియో కంపెనీ ఇప్పటికే ఫ్రాంఛైజీ విక్రయ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దీంతో 18 సంవత్సరాల తర్వాత కప్ గెలిచిన RCB.. త్వరలోనే చేతులు మారనుంది.