AUS vs PAK: వరల్డ్ కప్ స్క్వాడ్ ఇదేనా: బాబర్ వచ్చేశాడు.. ఆస్ట్రేలియా సిరీస్‌కు పాకిస్థాన్ జట్టు ప్రకటన

AUS vs PAK: వరల్డ్ కప్ స్క్వాడ్ ఇదేనా: బాబర్ వచ్చేశాడు.. ఆస్ట్రేలియా సిరీస్‌కు పాకిస్థాన్ జట్టు ప్రకటన

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న 2026 టీ20 వరల్డ్ కప్ కు పాకిస్థాన్ జట్టు ఇంకా స్క్వాడ్ ప్రకటించలేదు. మరో రెండు వారాల్లో ఈ మెగా టోర్నీ మొదలు కానున్నప్పటికీ పాకిస్థాన్ మాత్రం ఇంకా తమ జట్టును ప్రకటించకపోవడం షాకింగ్ గా మారుతుంది. వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శుక్రవారం (జనవరి 23) 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. జనవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. 

బిగ్ బాష్ లీగ్ లో రాణించకపోయినా పాకిస్థాన్ టీ20 జట్టులో బాబర్ అజామ్ కు చోటు కల్పించారు. బిగ్ బాష్ లీగ్ లో బాబర్ 11 మ్యాచ్‌ల్లో 103.06 స్ట్రైక్ రేట్‌తో కేవలం 202 పరుగులు మాత్రమే చేశాడు. వరల్డ్ కప్ ముందు టోర్నీ కావడంతో బాబర్ అనుభవాన్ని పాక్ క్రికెట్ బోర్డు వినియోగించుకోవాలని చూస్తున్నట్టు అర్ధమవుతోంది. బాబర్ తో పాటు స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది కూడా ఎంపికయ్యాడు. కొంతకాలంగా పాకిస్థాన్ టీ20 జట్టుకు దూరంగా ఉన్న అఫ్రిది జట్టులో చేరాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు జనవరి 24న లాహోర్‌లో సమావేశమవుతుందని.. మరుసటి రోజు నుండి ప్రాక్టీస్ ప్రారంభమవుతుందని ఆ దేశ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు జనవరి 28న పాకిస్థాన్ లో అడుగుపెట్టనుంది. 

►ALSO READ | నా పరువు తీసే కుట్ర: చీటింగ్ ఆరోపణలపై నోరు విప్పిన స్మృతి మందాన మాజీ బాయ్ ఫ్రెండ్

"పాకిస్తాన్ జట్టు.. ఆటగాళ్ల సహాయ సిబ్బంది శనివారం (జనవరి 24) లాహోర్‌లో సమావేశమై, మరుసటి రోజు సిరీస్ కోసం తమ సన్నాహాలను ప్రారంభిస్తారు. ఆస్ట్రేలియా బుధవారం (ఫిబ్రవరి 28) పాకిస్తాన్‌కు చేరుకోనుంది. 2022 ఏప్రిల్‌ తర్వాత పాకిస్థాన్ గడ్డపై ఆసీస్ తొలిసారి ఆడనుంది". అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అధికారికంగా ప్రకటించకపోయినా పాకిస్థాన్ వరల్డ్ కప్ స్క్వాడ్ కూడా ఇదే అని ఖాయం  చేసుకోవచ్చు. పాకిస్థాన్ గ్రూప్ ఏ లో ఇండియాతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 15 న మ్యాచ్ జరుగుతుంది.    

ఆస్ట్రేలియాతో తలపడే పాకిస్తాన్ 16 మంది సభ్యుల జట్టు:

సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్ , ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్