న్యూఢిల్లీ: ఈ వారం ఇండియా ఇన్‌ఫ్లేషన్ డేటా వెలువడనుంది. మార్కెట్‌పై దీని ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా గ్లోబల్ అంశాలు, విదేశీ ఇన్వెస్టర్ల కదలికలు మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయించనున్నాయి. ‘గత కొన్ని రోజులుగా క్రూడాయిల్ ధరలు పడుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 73 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఇండియాలో ఇన్‌ఫ్లేషన్ డేటాతో సహా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా విడుదల కానుంది.
గ్లోబల్‌గా చూస్తే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ నెలలో జరిగే యూఎస్ ఫెడ్ మీటింగ్‌పై దృష్టి పెట్టారు’ అని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. ఈ ఏడాది జులై నెలకు సంబంధించి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా, ఆగస్ట్‌కు సంబంధించి ఇన్‌ఫ్లేషన్ డేటా గురువారం వెలువడనున్నాయి. కిందటి వారం సెన్సెక్స్ 1,182 పాయింట్లు (1.43 శాతం) పడగా, నిఫ్టీ 384 పాయింట్లు పతనమైంది.