ప్రధాని మోదీ టోక్యో పర్యటన.. 10ట్రిలియన్ యెన్ల పెట్టుబడి ఒప్పందం !

ప్రధాని మోదీ టోక్యో పర్యటన.. 10ట్రిలియన్ యెన్ల పెట్టుబడి ఒప్పందం !

టోక్యో పర్యటలో ఉన్న ప్రధాని మోదీ జపాన్ తో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.రాబోయే  పదేళల్లో భారత్ లో 10 ట్రిలియన్ యెన్లు (68 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు రానున్నాయని ప్రధాని ప్రకటించారు. ఇవి గత పెట్టుబడులకంటే రెట్టింపు అని ప్రధాని అన్నారు. భారత్ తయారీ , ఎగుమతులను పెంచేందుకు అడ్వాన్స్ డ్ కంపెనీలను ఆహ్వానించామన్నారు మోదీ. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ నినాదంతో భారత్ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.  భారత్ పెట్టుబడులు పెట్టాలని జపాన్ సంస్థలను కోరారు. 

భారత్, జపాన్ మధ్య ఒప్పందాలు.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(SME)లను అనుసంధానించడం, స్టార్టప్ లను ప్రోత్సహించనున్నాయి. సెమీ కండక్టర్లు, AI,క్లీన్ ఎనర్జీ తయారీలో పరస్పర సహకారం పెంచుతాయని భావిస్తున్నారు. భారత్ ను స్కిల్డ్ పవర్ సెంటర్ గా, జపాన్ ను టెక్ పవర్ హౌజ్ గా పోల్చిన మోదీ.. ఈ సినర్జీ భవిష్యత్ ఆవిష్కరణలకు, పారిశ్రామిక వృద్ధికి తోడ్పడతాయని స్పష్టం చేశారు. 

ప్రపంచం కోసం.. వ్యూహాత్మక భాగస్వామ్యం 

టోక్యో చర్చల సందర్భంగా రెండు దేశాల నేతలు పలు కీలక అంశాలను చర్చించారు. రెండు దేశాల భాగస్వామ్యం తమ జాతీయ ప్రయోజనాలతోపాటు ప్రపంచ శాంతి, స్థితర్వానికి కూడా కీలకం అన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు ఆర్థిక భద్రత, సరఫరా ,రక్షణలో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ,స్థిరమైన శక్తిలో సహకరించుకోవాలని, ఇది మెరుగైన ప్రపంచానికి స్థిరమైన పునాదిని ఏర్పరుస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.