అమ్మాయిలదే ఆసియా​ కిరీటం​..హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌

అమ్మాయిలదే ఆసియా​ కిరీటం​..హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌

కకమిగహర (జపాన్‌‌‌‌‌‌‌‌): ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో అదరగొట్టిన ఇండియా జూనియర్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌.. తొలిసారి ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 2–1తో నాలుగుసార్లు చాంపియన్‌‌‌‌‌‌‌‌ సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియాకు షాకిచ్చింది. ఇండియా తరఫున అన్నూ (21వ ని.), నీలమ్‌‌‌‌‌‌‌‌ (40వ ని.) గోల్స్‌‌‌‌‌‌‌‌ చేయగా, పార్క్‌‌‌‌‌‌‌‌ సియోన్‌‌‌‌‌‌‌‌ (24వ ని.) కొరియాకు ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌ అందించింది. తొలి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడటంతో గోల్స్‌‌‌‌‌‌‌‌ రాలేదు. 

కానీ తర్వాతి క్వార్టర్స్​లో ఇండియా ఫార్వర్డ్స్​ చిన్న పాస్​లతో సక్సెస్​ అయ్యారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ప్రీతికి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. అద్భుత విజయం సాధించిన ఇండియా ప్లేయర్లకు హాకీ ఇండియా (హెచ్‌‌‌‌‌‌‌‌ఐ) క్యాష్‌‌‌‌‌‌‌‌ అవార్డును ప్రకటించింది. ఒక్కో ప్లేయర్‌‌‌‌‌‌‌‌కు రూ. 2 లక్షలు, సపోర్ట్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌కు లక్ష రూపాయల చొప్పున ఇవ్వనుంది.