కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. 60వేలు దాటిన యాక్టివ్ కేసులు

కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. 60వేలు దాటిన యాక్టివ్ కేసులు

దేశంలో గత 24 గంటల్లో 9,111 కోవిడ్ -19 కేసులు, 27 మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 60,000 మార్కును దాటేసింది. ఇప్పటివరకు మొత్తం 60,313 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఇన్ఫెక్షన్‌లలో 0.13% గా రికార్డు కాగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 8.40% కు చేరుకుంది. 

తాజాగా దేశంలో గుజరాత్‌లో ఆరుగుకు, ఉత్తరప్రదేశ్‌లో నలుగురు, రాజస్థాన్, ఢిల్లీలో ముగ్గురు, మహారాష్ట్రలోఇద్దరు, తమిళనాడు, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్ లోనూ మూడు మరణాలు నమోదుకావడంతో  మొత్తం మరణాల సంఖ్య 5,31,141కి చేరుకుంది. గత 24 గంటల్లో 6,313 మంది కోలుకున్నారని, మొత్తం వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,42,35,772కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జాతీయ రికవరీ రేటు 98.68% వద్ద ఉండగా, కేసు మరణాల రేటు 1.18% వద్ద నమోదైంది.