2016 నుండి టెస్టుల్లో నెంబర్ వన్ గా ఉన్న కోహ్లీ సేన ప్రస్తుతం ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. లేటెస్టుగా ICC ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉండగా… భారత్ మూడో స్థానానికి చేరింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 116 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా… న్యూజిలాండ్ 115 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. 114 పాయింట్లతో భారత్ మూడవ స్థానానికి చేరుకుంది. ర్యాంకింగ్స్ కోసం 2019 మే నుంచి ఆడిన మ్యాచులు 100 శాతం… అంతకుముందు రెండేళ్లకు సంబందించిన మ్యాచులకు 50 శాతం రేటింగ్ పాయింట్లను ఆధారంగా తీసుకున్నారు. దీంతో భారత్ మొదటి స్థానం నుండి మూడో స్థానానికి పడిపోయింది.


