Neel Patel: వచ్చే నెలలో భారత్‌లో జరగబోయే మల్టీ-ఫార్మాట్ సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ప్రకటించింది. ఈ టీంలో భారత సంతతికి చెందిన 16 ఏళ్ల యువ సంచలనం నీల్ పటేల్ (Neel Patel) స్థానం దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ పర్యటనలో ఫాస్ట్ బౌలర్లు విల్ బైరమ్, కేసీ బార్టన్‌లు ఆస్ట్రేలియా పేస్ దళానికి నాయకత్వం వహించనున్నారు.
పర్యటన షెడ్యూల్:
ఆస్ట్రేలియా అండర్-19 జట్టు తమ భారత పర్యటనలో స్థానిక భారత్ అండర్-19 జట్టుతో మూడు 50 -ఓవర్ల (వన్డే) మ్యాచ్‌లు, మల్టీ-డే మ్యాచ్‌లలో పోటీ పడనుంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు గుజరాత్‌లోని రాజ్‌కోట్, అహ్మదాబాద్ నగరాలు వేదికలుగా వ్యవహరించనున్నాయి.
నీల్ పటేల్ అరుదైన రికార్డు:
సిడ్నీ ప్రిమియర్ క్రికెట్ ఫస్ట్ గ్రేడ్‌లో యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW) క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నీల్ పటేల్ అద్భుత ప్రదర్శనతో తుది జట్టులో స్థానం సంపాదించాడు. కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1000+కి పైగా పరుగులు సాధించి, ఆ లీగ్‌లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన ప్లేయర్స్ లో ఒకడిగా నిలిచాడు.
పేస్ దళంగా బైరమ్, కేసీ బార్టన్:
ఈ ఏడాది జింబాబ్వే వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో ఆడిన అనుభవం ఉన్న ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్‌తో చెలరేగే విల్ బైరమ్ అండర్–19 ప్రపంచకప్‌లో 10.50 సగటుతో 10 వికెట్లు పడగొట్టగా, కేసీ బార్టన్ 4 వికెట్లు సాధించాడు.
యువ ఆటగాళ్లకు గొప్ప వేదిక: క్రికెట్ ఆస్ట్రేలియా
ఈ టూర్ ప్రాధాన్యత గురించి క్రికెట్ ఆస్ట్రేలియా నేషనల్ డెవలప్‌మెంట్ హెడ్ సోన్యా థాంప్సన్ మాట్లాడుతూ.. పాత్‌వేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని అత్యుత్తమ యువ ఆటగాళ్లకు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇదొక సువర్ణావకాశం. ఇండియా లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో బలమైన జట్టుతో పోటీపడటం వారి సాంకేతిక నైపుణ్యాలను, మానసిక దృఢత్వాన్ని ఎంతగానో తీర్చిదిద్దుతుందని తెలిపారు.
చెన్నైలో ఆసీస్ డెవలప్‌మెంట్ స్క్వాడ్ ల్యాండ్:
మరోవైపు, ప్రతియేటా నిర్వహించే MRF అకాడమీ ప్రోగ్రామ్ కోసం 12 మంది సభ్యులతో కూడిన క్రికెట్ ఆస్ట్రేలియా (CA) డెవలప్‌మెంట్ స్క్వాడ్ ఇప్పటికే చెన్నైకి చేరుకుంది. ఆస్ట్రేలియా టీ20 అరంగేట్ర ప్లేయర్ జోయెల్ డేవిస్ నేతృత్వంలోని ఈ జట్టు, ఆగస్టు 5,6 ఆగస్టు 10, 11 తేదీలలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై రెండు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడనుంది.
ఆస్ట్రేలియా అండర్-19 పూర్తి జట్టు:
కేసీ బార్టన్, హేడెన్ బార్బులోవి, ఎలీ బ్రెయిన్, విల్ బైరమ్, బ్లేక్ క్యాటిల్, జాక్ సిజోస్నెక్, స్పెన్సర్ గ్రీన్, కానర్ గ్రెగరీ, చార్లీ హెండర్సన్, జెడ్ హాలిక్, మాథ్యూ లాఫ్, నీల్ పటేల్, జాకబ్ పియెట్జ్, పాట్రిక్ సుల్లివాన్, థియో త్సింగోస్, థామస్ వాసియో.
Introducing our Australian Men's Under 19 squad to tour India next month 👋 pic.twitter.com/1z8Vf6erj7
— Cricket Australia (@CricketAus) August 2, 2026
🚨🗣️ Sonya Thompson, Cricket Australia's Head of National Development, explains why its U19 team is touring India.
— TheWicketReport (@WicketReport) August 3, 2026
"Touring India and playing against high-quality opposition in challenging conditions will be a valuable experience and test the players technically and mentally… pic.twitter.com/dsd2wlcKMj
