న్యూఢిల్లీ: భారత్, ఒమన్ దేశాల మధ్య కుదిరిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్ అగ్రిమెంట్ (సీఈపీఏ) అమలులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం కొత్త నోటిఫికేషన్‌ను ప్రకటించింది. జూన్ 1 నుంచి (సోమవారం) ఒమన్ దేశ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ఇరు దేశాల మధ్య గత ఏడాది డిసెంబర్‌లో ఈ వాణిజ్య ఒప్పందం కుదిరింది.
అయితే, ఈ టారిఫ్ మినహాయింపును పొందాలనుకునే దిగుమతిదారులు.. సదరు వస్తువులు ఒమన్ దేశానికి చెందినవేనని డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్‌కు తగిన ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దాదాపు 77.79 శాతం ఒమన్ ఉత్పత్తులపై టారిఫ్ మినహాయింపులను ఇండియా ఇస్తోంది. విలువ పరంగా చూస్తే ఈ దేశం నుంచి జరిగే మొత్తం దిగుమతులలో ఇది 94.81 శాతం వాటాను కవర్ చేస్తుంది.
