కరోనాతో ఒక్క రోజులో 40 మంది మృతి

కరోనాతో ఒక్క రోజులో 40 మంది మృతి

దేశంలో కోవిడ్ కేసులు రోజుకో విధంగా నమోదవుతున్నాయి. ఒకరోజు భారీగా.. మరోరోజు తక్కువ సంఖ్యలో రికార్డవుతున్నాయి. కొత్తగా 17 వేల 135 మందికి వైరస్ సోకగా.. మరో 40 మంది చనిపోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,37,057గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 5,26,477కి చేరింది. ఇప్పటి వరకు 43,34,03,610 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 204,84,30,732 కరోనా డోస్ లను పంపిణీ చేశారు. అందులో 23,49,6541 డోసులను మంగళవారం ఇచ్చారు. కరోనాపై పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ లను ఉచితంగానే అందచేస్తున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు.. దేశంలో మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో మరో కేసు నమోదు అయ్యింది. దీంతో దేశంలో మంకీ పాక్స్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇందులో ఐదు కేరళ, మూడు ఢిల్లీలో నమోదు అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కేసుతో... చాలా ప్రాంతాల్లో అనుమానిత లక్షణాలతో పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ ను పుణే వైరాలజీ ల్యాబ్ కు పంపిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు నమోదు అయిన ఎనిమిది కేసుల్లో ఐదుగురు విదేశీ ట్రావెల్ హిస్టరీ ఉన్నట్లు తెలిపారు అధికారులు.