
ఐసీసీ సోమవారం (మే 5) అన్ని ఫార్మాట్లకు సంబంధించిన ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. వైట్ బాల్ ఫార్మాట్ లో తిరుగులేకుండా దూసుకెళ్తున్న టీమిండియా వన్డే, టీ20ల్లో అగ్ర స్థానంలో కొనసాగుతుంది. గత రెండేళ్లుగా వన్డే, టీ20 ఫార్మాట్ లో భారత క్రికెట జట్టు అన్ని జట్లపై ఆధిపత్యం చూపిస్తూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ వరకు చేరుకోగా.. 2024 టీ20 వరల్డ్ గెలిచారు. ఇటీవలే జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ద్వైపాక్షిక సిరీస్ లోనూ మనకు ఎదురు లేకుండా పోయింది.
ALSO READ | IND vs ENG: గిల్‌కు టెస్ట్ వైస్ కెప్టెన్సీ పగ్గాలు.. బుమ్రాను తప్పించడానికి కారణం ఇదే!
ఇక టెస్ట్ విషయానికి వస్తే మనోళ్లు కాస్త వెనుకబడ్డారు. ఇటీవలే కాలంలో స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అవ్వడంతో పాటు.. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో ఓడిపోయింది. దీంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా టాప్ లో ఉంది. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్న న్యూజిలాండ్.. ఇండియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోగా.. శ్రీలంక, పాకిస్థాన్ వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నాయి.
టీ20 విషయానికి వస్తే భారత్ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, వెస్టిండీస్ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. వన్డేల్లో వెస్టిండీస్, బంగ్లాదేశ్ టాప్-8 లో స్థానం కోల్పోయి వరుసగా 9, 10 స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలే టీ20 క్రికెట్ లో చెత్తగా ఆడుతున్న పాకిస్థాన్ 8 వ స్థానానికి పడిపోయింది.
ICC Annual Ranking 🏏
— CricketGully (@thecricketgully) May 5, 2025
India retains the top spot in ODIs & T20Is, but drops to No. 4 in Tests 🇮🇳 pic.twitter.com/ZZjRpAvIKI