
జూన్ 20 నుంచి జరగనున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు టీమిండియా వైస్ కెప్టెన్ ఎవరో ఒక క్లారిటీ వచ్చేసింది. రోహిత్ శర్మ డిప్యూటీగా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ ను టెస్ట్ వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడం దాదాపుగా ఖాయమైంది. మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో భారత రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ బుమ్రాకు బీసీసీఐ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బుమ్రాను టెస్ట్ వైస్ కెప్టెన్ నుంచి తప్పించడానికి కారణం లేకపోలేదు. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ కింద బుమ్రాకు వైస్ కెప్టెన్సీ ఇవ్వట్లేదు.
ఇంగ్లాండ్ తో భారత్ 5 టెస్ట్ మ్యాచ్ లో సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. దాదాపు రెండు నెలల పాటు జరిగే ఈ మెగా సిరీస్ కు బుమ్రా గాయపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్ గా లేకపోతే అతని స్థానంలో వైస్ కెప్టెన్ పూర్తి ఫిట్ నెస్ తో ఉండాలి. కానీ ఒక ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా ఫిట్ నెస్ పై అనుమానాలు నెలకొన్నాయి. ఇంగ్లాండ్ లో కూడా బుమ్రాను అని టెస్టులు ఆడించే ఉద్దేశ్యంలో బీసీసీఐ లేనట్టు తెలుస్తోంది. బుమ్రా మూడు సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్‌లో వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు రోహిత్ గైర్హాజరీలో ఈ ఫాస్ట్ బౌలర్ మూడు మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.
ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ స్థానంలో చివరి టెస్టులో కెప్టెన్సీ చేస్తూ బుమ్రా గాయపడ్డాడు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్ లో బుమ్రాకు వీలైనంత ఎక్కువరెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. మరోవైపు గిల్ ప్రస్తుతం వైట్ బాల్ ఫార్మాట్ లలో వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్.. వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా కొనసాగుతున్నాడు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని గిల్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తుంది.
►ALSO READ | IPL: కోల్‌కథ ఇంకా ఉంది ..ఒక్క రన్ తేడాతో రాజస్తాన్‌పై కేకేఆర్ థ్రిల్లింగ్ విక్టరీ
ఇంగ్లాండ్ తో జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ అయిపోయిన వెంటనే వారం రోజుల గ్యాప్ లో భారత జట్టు ఇంగ్లాండ్ కు పయనమవనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025-27 సైకిల్ లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ కు భారత జట్టును మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి ఇండియా ఎక్కువగా యంగ్ ప్లేయర్లతోనే బరిలోకి దిగబోతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది.
హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. గత ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి.
🚨 VICE CAPTAIN SHUBMAN GILL. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2025
- Gill could be picked as the Vice Captain for the England Test series. (TOI). pic.twitter.com/JksXmdQm76