V6 News

దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి

దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశానికి నాలుగు రాజధానులు ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతోత్సవాల్లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలని మమతా బెనర్జీ అన్నారు. అప్పట్లో కోల్‌కతాను రాజధానిగా చేసుకుని ఆంగ్లేయులు ఏలారని, అలాంటప్పుడు దేశంలో ఒక్క రాజధాని నగరమే ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా… కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు మమత. సుభాష్ చంద్రబోస్ స్మృతిగా ఆజాద్ హింద్ స్మారకం నిర్మిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ మమత… ఇంతకుముందెన్నడూ నేతాజీ జయంతిని అధికారికంగా నిర్వహించకపోవడాన్ని ప్రశ్నించారు. వారు వేల కోట్లతో విగ్రహాలు నిర్మించారని… తాము మాత్రం… ఆజాద్ హింద్ స్మారకం కడతామన్నారు. సుభాష్ చంద్రబోస్ ను దేశ్ నాయక్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారని… అందుకే తాము దేశ్ నాయక్ దివస్ నిర్వహిస్తున్నామన్నారు