చాంగ్డౌ (చైనా): చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో ఇండియా షట్లర్ మాళవిక బన్సొద్ పోరాటం ముగిసింది. తనకంటే మెరుగైన ప్రత్యర్థులకు షాకిస్తూ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన మాళవిక అక్కడితోనే ఆగిపోయింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 43వ ర్యాంకర్ మాళవిక 10–21, 16–21తో ఐదో ర్యాంకర్ అకానె యమగూచి చేతిలో వరుస గేమ్స్‌లో పరాజయం పాలైంది. రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన అకానె చేతిలో మాళవికకు ఇది వరుసగా మూడో ఓటమి.